'మావిగన్' బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదం: రఘురామకృష్ణరాజు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే పద్ధతులు వేరుగా ఉంటాయని, భౌతిక దాడులు చేయడం అమానుషమని ఆయన మండిపడ్డారు.
గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం వల్లే వైసీపీ 175 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని, ఇప్పుడు మీడియాపై దాడులు చేయడం వారి పతనానికి పరాకాష్ఠ అని ఎద్దేవా చేశారు. 'మావిగన్' బిల్లును అసెంబ్లీలో పెడతానని జగన్ అనడం హాస్యాస్పదమని, అది ఎప్పటికీ జరగని పని అని తేల్చిచెప్పారు. ప్రజలకు రోజూ సినిమాలు చూపిస్తామంటే చూసేందుకు ఎవరూ ఖాళీగా లేరని ఘాటుగా విమర్శించారు.
తనను చిత్రహింసలకు గురిచేసిన వారిని చట్టం విడిచిపెట్టదని, తమిళనాడులోని జయరాజ్-బెన్నిక్స్ కేసు తరహాలోనే ఇక్కడి దోషులకు కూడా శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే సునీల్ కుమార్ అండ్ బ్యాచ్‌కు భయం పట్టుకుందని పేర్కొన్నారు.