ఓ ఉద్యోగి నిర్వాకంతో బూడిదైన కింబర్లీ-క్లార్క్ గోదాం.. వీడియో ఇదిగో!
జీతం సరిపోవడం లేదన్న అసంతృప్తో లేక బాస్ పై కోపమో.. ఓ ఉద్యోగి చేసిన పని మొత్తం కంపెనీని నష్టాల పాలు చేసింది. కంపెనీ గోడౌన్ లో ప్యాక్ చేసిన టాయిలెట్ పేపర్ల బండిల్ కు ఆ ఉద్యోగి నిప్పు పెట్టాడు. దీంతో మంటలు విస్తరించి మొత్తం గోడౌన్ ను బూడిద చేశాయి. మంటలు ఆర్పేందుకు ఏకంగా 175 ఫైరింజన్లు వచ్చాయంటే అగ్ని ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అంటారియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ప్రపంచ ప్రఖ్యాత 'కింబర్లీ-క్లార్క్' సంస్థకు చెందిన గోడౌన్ లో చామెల్ అబ్దుల్ కరీం (29) అనే ఉద్యోగి మంగళవారం తెల్లవారుజామున టాయిలెట్ పేపర్ బండిళ్లకు లైటర్‌తో నిప్పుపెట్టాడు. ఈ దారుణానికి పాల్పడుతున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.
గోదాంలో పేపర్ ఉత్పత్తులు ఉండటంతో మంటలు క్షణాల్లో భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దీనిని '6-అలారం ఫైర్'గా ప్రకటించి, ఏకంగా 175 ఫైరింజన్లు, వందలాది మంది సిబ్బందితో మంటలను అదుపు చేసేందుకు గంటల తరబడి శ్రమించారు. అయినప్పటికీ 1.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలోని గోదాం పైకప్పు కూలిపోయి, లోపలున్న సరుకంతా బూడిదైంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న 20 మంది ఉద్యోగులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనకు కారణమైన చామెల్ అబ్దుల్ కరీంను పోలీసులు అరెస్ట్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా అమెరికా వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో టాయిలెట్ పేపర్, టిష్యూల సరఫరాపై ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.