'మై టీడీపీ యాప్' టాప్ పెర్ఫార్మర్స్‌తో మంత్రి లోకేశ్ భేటీ.. ఫొటోలు ఇవిగో!

Nara Lokesh Meets My TDP App Top Performers
షార్ట్స్‌లో చూడండి
కష్టపడి పనిచేసే వారిని గుర్తించడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, 'మై టీడీపీ యాప్'‌ను సమర్థవంతంగా వినియోగిస్తున్న టాప్ 10 పెర్ఫార్మర్స్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ ఆత్మీయ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా లోకేశ్... పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. వారి కుటుంబ నేపథ్యం, కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ, సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్న కార్యకర్తల సేవలను ఆయన అభినందించారు.

పార్టీకి కార్యకర్తలే బలమని, వారి శ్రమను ఎన్నటికీ విస్మరించబోమని లోకేశ్ భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఇలాగే పనిచేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు మంత్రి లోకేశ్ తో నేరుగా మాట్లాడే అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
My TDP App
TDP
Telugu Desam Party
Andhra Pradesh
AP Politics
Mangalagiri
Party Activists
IT Minister
AP IT Minister

More Telugu News