ఆర్టీఏ అధికారి చొరవను ప్రశంసించిన మంత్రి నారా లోకేశ్.. వీడియో ఇదిగో!

Nara Lokesh Appreciates RTA Officer Initiative on Bus Passenger Safety
షార్ట్స్‌లో చూడండి
బస్సు ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ఓ అధికారి చూపిన చొరవను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ (ఎంవీఐ) సిద్దిఖ్ చేపట్టిన వినూత్న అవగాహన కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, దీనిపై మంత్రి స్పందించారు.

ఉయ్యూరు సమీపంలో ఓ ప్రైవేట్ బస్సును ఆపిన ఎంవీఐ సిద్దిఖ్.. నేరుగా బస్సులోకి వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ‘ప్రమాదానికి గురైనప్పుడు, మంటలు వ్యాపిస్తున్నపుడు లగేజీ, వస్తువుల కోసం చూడొద్దు. వాటి కోసం విలువైన సమయాన్ని వృథా చేయొద్దు. వస్తువుల కంటే మీ ప్రాణాలే ముఖ్యం. వెంటనే బస్సు దిగి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి’ అని ఆయన సూచించారు. ప్రయాణం ప్రారంభంలోనే ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉందో చూసుకోవాలని, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలని చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మంత్రి నారా లోకేశ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ‘ప్రయాణికుల భద్రతపై ఈ అధికారి చూపిస్తున్న చొరవ అభినందనీయం. ఇలాంటి చిన్న జాగ్రత్తలే ఎంతోమంది ప్రాణాలను కాపాడతాయి’ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటించాలని, ఈ వీడియోను అందరితో పంచుకోవాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా, అధికారులు నేరుగా ప్రయాణికులకు అవగాహన కల్పించడంపై ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Go Back to Shorts
Nara Lokesh
Motor Vehicle Inspector Siddiq
Krishna District
Uyyuru
Bus Accidents
Road Safety
Passenger Safety
Emergency Exit
Andhra Pradesh
RTA

More Telugu News