Chandrababu Naidu: అమరావతికి రాష్ట్రపతి ఆమోదం.. గెజిట్ పై సీఎం చంద్రబాబు స్పందన

Chandrababu Naidu Reacts to Amaravati as AP Capital Gazette
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చారిత్రక పరిణామంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి నా ప్రగాఢ కృతజ్ఞతలు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి మా కలను సాకారం చేశారు" అని పేర్కొన్నారు. రాష్ట్రానికి అండగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ బిల్లుకు మద్దతు పలికిన ఎంపీలు, రాష్ట్ర నాయకులు, ఉద్యమంలో అండగా నిలిచిన ప్రతి పౌరుడికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. "ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయం" అని ఆయన తన పోస్టులో ఉద్ఘాటించారు. 

Go Back to Shorts
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh Capital
Droupadi Murmu
AP Reorganisation Act 2014
Narendra Modi
AP Gazette Notification
Amaravati Farmers

More Telugu News