Volodymyr Zelensky: అమెరికాపై జెలెన్స్కీ అసంతృప్తి... ఎందుకంటే...!
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే, తమ దేశానికి అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి అందే సైనిక సహాయం గణనీయంగా తగ్గిపోతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త సంక్షోభం వల్ల పశ్చిమ దేశాల ప్రాధాన్యతలు మారిపోయాయని, ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు.
ఓ ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడుతూ, "అమెరికా మాకు ఇవ్వాల్సిన క్షిపణులు, ఆయుధాలు ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు మళ్లుతున్నాయి" అని వాపోయారు. గతంలో రష్యా బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి అమెరికా సరఫరా చేసిన పేట్రియాట్ వంటి రక్షణ వ్యవస్థలు ఉపయోగపడ్డాయని, కానీ ఇప్పుడు ఆ సరఫరా తగ్గిపోవడంతో యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోందని వివరించారు. పశ్చిమాసియాలో యుద్ధం ఎంతకాలం కొనసాగితే, తమకు ఆయుధాలు అందే అవకాశాలు అంతగా తగ్గిపోతాయని అన్నారు.
అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ ప్రధాన ప్రాధాన్యత కాదని స్పష్టమవుతోందని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. తమ ఆయుధ నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయని, దీంతో అమెరికా మద్దతు తగ్గడంతో సొంతంగా డ్రోన్ల తయారీని పెంచుతున్నామని చెప్పారు. అయితే, రష్యా తమ ఇంధన, ఆయుధ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ఇబ్బందిగా మారిందని తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడో సంవత్సరంలోకి ప్రవేశించిన తరుణంలో, పశ్చిమాసియాలో తలెత్తిన ఈ కొత్త సంక్షోభం పశ్చిమ దేశాల దృష్టిని మరల్చడం రష్యాకు అనుకూలంగా మారుతుందని జెలెన్స్కీ పరోక్షంగా సూచించారు. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపి, ఉక్రెయిన్‌కు మరిన్ని సవాళ్లను సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.