British flight attendant: డ్రోన్ దాడి ఫొటో షేర్ చేశాడని... బ్రిటీష్ విమాన సహాయకుడి అరెస్ట్
దుబాయ్‌లో పనిచేస్తున్న 25 ఏళ్ల బ్రిటీష్ ఫ్లైట్ అటెండెంట్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ డ్రోన్ దాడికి సంబంధించిన ఫొటోను వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడమే ఇందుకు కారణమైంది. యూఏఈలోని సైబర్ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే.
వివరాల్లోకి వెళితే, స్థానిక విమానయాన సంస్థలో క్యాబిన్ క్రూ సభ్యుడిగా పనిచేస్తున్న ఈ యువకుడు, మార్చి 7న దుబాయ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన డ్రోన్ దాడి డ్యామేజీని ఫొటో తీశాడు. ఆ ఫొటోను తన సహోద్యోగులతో ఉన్న ప్రైవేట్ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేస్తూ, ‘విమానాశ్రయంలోకి వెళ్లడం సురక్షితమేనా?’ అని ప్రశ్నించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దేశ భద్రతకు భంగం కలిగించే కంటెంట్‌ను షేర్ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. యూఏఈ కఠిన సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం, అతను దోషిగా తేలితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, 200,000 దిర్హామ్‌లు (సుమారు రూ.50 లక్షలు) జరిమానా, దేశ బహిష్కరణ శిక్ష పడే అవకాశం ఉంది.
ఇది ఒక్కరికే పరిమితమైన సంఘటన కాదని తెలుస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, డ్రోన్ దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసినందుకు డజన్ల కొద్దీ బ్రిటన్ పౌరులను అరెస్ట్ చేశారు. వీరిలో పర్యాటకులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. ‘డిటైన్డ్ ఇన్ దుబాయ్’ అనే హక్కుల సంస్థ అంచనా ప్రకారం, ఇప్పటివరకు సుమారు 70 మంది బ్రిటన్ పౌరులు ఇలాంటి కేసుల్లో చిక్కుకున్నారు.
ఆన్లైన్లో ఇప్పటికే విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఫొటోలను రీపోస్ట్ చేయడం సురక్షితమని చాలామంది భావిస్తారని, కానీ యూఏఈలో అది చాలా ప్రమాదకరమని ‘డిటైన్డ్ ఇన్ దుబాయ్’ సీఈఓ రాధా స్టర్లింగ్ హెచ్చరించారు. మరోవైపు, బ్రిటీష్, ఇండియన్ రాయబార కార్యాలయాలు కూడా తమ పౌరులకు సున్నితమైన భద్రతా చిత్రాలను తీయవద్దని, పంచుకోవద్దని అత్యవసర సూచనలు జారీ చేశాయి.