Heinrich Klaasen: క్లాసెన్, నితీశ్ అద్భుత పోరాటం... గౌరవప్రద స్కోరు సాధించిన సన్ రైజర్స్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాడే స్కోరు సాధించింది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైన చోట హెన్రిచ్ క్లాసెన్ (62), నితీశ్ కుమార్ రెడ్డి (56) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి పోరాటంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు బౌలర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. మహమ్మద్ షమీ తన పదునైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (7)లను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్ (1), లియామ్ లివింగ్‌స్టోన్ (14) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో సన్‌రైజర్స్ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ సంయమనంతో ఆడుతూనే, చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు ఏకంగా 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. నితీశ్ రెడ్డి 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేయగా, క్లాసెన్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. తొలి 10 ఓవర్లలో కేవలం 35 పరుగులే చేసిన సన్‌రైజర్స్... ఆ తర్వాత 10 ఓవర్లలో 121 పరుగులు చేసిందంటే ఆ క్రెడిట్ నితీశ్-క్లాసెన్ జోడీకే దక్కుతుంది.
అయితే, వీరిద్దరూ ఔటయ్యాక చివరి ఓవర్లలో హైదరాబాద్ మళ్లీ వికెట్లు కోల్పోవడంతో 156 పరుగులతో సరిపెట్టుకుంది. లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.