Sunrisers Hyderabad: లక్నో బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ విలవిల... టాపార్డర్ కుప్పకూలింది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తడబడింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు సన్‌రైజర్స్ టాపార్డర్ కుప్పకూలింది. ఫలితంగా 8 ఓవర్లు ముగిసేసరికి కేవలం 29 పరుగులు మాత్రమే చేసి 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ లక్నో బౌలర్లు ఆరంభం నుంచే వికెట్ల వేట కొనసాగించారు. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన అద్భుత స్పెల్‌తో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), ట్రావిస్ హెడ్ (7) ఇద్దరినీ షమీనే పెవిలియన్ చేర్చాడు.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (1) ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో, దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ (14) దిగ్వేశ్ సింగ్ రాఠీ బౌలింగ్‌లో ఔటయ్యారు. దీంతో సన్‌రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. వరుస వికెట్లతో స్కోరు బోర్డు నత్తనడకన సాగింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్ (4), నితీశ్ కుమార్ రెడ్డి (2) ఉన్నారు. జట్టును ఆదుకుని గౌరవప్రదమైన స్కోరు అందించాల్సిన బాధ్యత వీరిపై ఉంది.