Ishan Kishan: సొంతగడ్డపై గెలిచేందుకు ఉరకలేస్తున్న సన్‌రైజర్స్... టాస్ గెలిచిన లక్నో

Ishan Kishan Sunrisers Hyderabad Set to Clash with Lucknow After Toss Win
షార్ట్స్‌లో చూడండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ జట్టు సొంత ప్రేక్షకుల మధ్య మొదట బ్యాటింగ్ చేయనుంది.

టాస్ గెలిచిన అనంతరం లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ.. "మేం మొదట బౌలింగ్ చేస్తాం. పిచ్ బాగుంది, మొదట వారిని బ్యాటింగ్ చేయనిచ్చి, రెండో ఇన్నింగ్స్‌లో ఒత్తిడి పెంచాలనుకుంటున్నాం. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా, తొలి 6 ఓవర్ల తర్వాత బంతి కాస్త నెమ్మదించే అవకాశం ఉంది" అని తెలిపాడు. జట్టులో ఒకే మార్పు చేశామని, ఆన్రిచ్ నోర్కియా స్థానంలో మణిమారన్ సిద్ధార్థ్ ఆడుతున్నాడని చెప్పాడు.

సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. "సొంత మైదానంలో ఆడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మేం జట్టులో రెండు మార్పులు చేశాం. లియామ్ లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు. హర్షల్ ఇక్కడ ఎప్పుడూ బాగా రాణిస్తాడు, లివింగ్‌స్టోన్ ఆఫ్‌స్పిన్‌తో ఉపయోగపడతాడు. ప్రశాంతంగా ఉంటూ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడం ముఖ్యం" అని పేర్కొన్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్:
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.

లక్నో సూపర్ జెయింట్స్ 
మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఐడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహ్మద్ షమీ, దిగ్వేశ్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.




Go Back to Shorts
Ishan Kishan
Sunrisers Hyderabad
Lucknow Super Giants
IPL 2026
Rajiv Gandhi International Stadium
Rishabh Pant
Liam Livingstone
Harshal Patel
Travis Head
Toss

More Telugu News