‘వారణాసి’లో మోస్ట్ కాంప్లెక్స్ మైండ్.. పృథ్వీరాజ్‌కు మహేశ్‌, జ‌క్క‌న్న బర్త్ డే విషెస్.. స్పెషల్ ఫొటో రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘వారణాసి’లో మోస్ట్ కాంప్లెక్స్ మైండ్.. పృథ్వీరాజ్‌కు మహేశ్‌, జ‌క్క‌న్న బర్త్ డే విషెస్.. స్పెషల్ ఫొటో రిలీజ్

Prithviraj Sukumaran gets birthday wishes from Mahesh Babu and Rajamouli for Varanasi
  • మహేశ్‌ బాబు 'వారణాసి' చిత్రంలో విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్
  • పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపిన చిత్రయూనిట్
  • 'కుంభ' ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన వ్యక్తి అంటూ జ‌క్క‌న్న‌ పోస్ట్
  • రాజమౌళి, పృథ్వీరాజ్ చర్చించుకుంటున్న వర్కింగ్ స్టిల్ విడుదల
  • 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల అని ప్రకటన
సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న గ్లోబల్ చిత్రం ‘వారణాసి’ నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు (అక్టోబర్ 16) సందర్భంగా చిత్రబృందం ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ పోషిస్తున్న 'కుంభ' పాత్రకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని వెల్లడించింది.

ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాయి. రాజమౌళి, పృథ్వీరాజ్ సెట్స్‌లో ఓ సన్నివేశం గురించి సీరియస్‌గా చర్చించుకుంటున్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్నాయి. "'వారణాసి' ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన మేధస్సు కలిగిన వ్యక్తి.. హ్యాపీ బర్త్ డే కుంభ" అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నాయి. ఈ ఒక్క వాక్యంతో సినిమాలోని విలన్ పాత్ర ఎంత శక్తిమంతంగా ఉండబోతుందో చెప్పకనే చెప్పాయి.

మరోవైపు హీరో మహేశ్‌ బాబు, దర్శకుడు రాజమౌళి కూడా పృథ్వీరాజ్‌కు వ్యక్తిగతంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ''పుట్టినరోజు శుభాకాంక్షలు కుంభ. ఈ రోజు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషం లభించాలని ఆశిస్తున్నాను'' అంటూ మహేష్ బాబు 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

దర్శకధీరుడు రాజమౌళి తనదైన శైలిలో పృథ్వీరాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, అతని పాత్ర ప్రాధాన్యతను వివరించారు. ''హ్యాపీ బర్త్ డే పృథ్వీ. ఈ రోజు నీలో ఉన్న 'కుంభ'ను నిద్రలేపాలని నేను అనుకోలేదు. ప్రపంచంపై తనదైన ముద్ర వేయాలని విధి నిర్ణయించుకున్న వ్యక్తి కుంభ'' అని రాజమౌళి రాసుకొచ్చారు. రాజమౌళి పోస్ట్‌తో కథానాయకుడికి ధీటుగా, ఓ బలమైన లక్ష్యంతో ప్రతినాయకుడి పాత్రను తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంలో వరల్డ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, క్యారెక్టర్ పోస్టర్లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, కార్తికేయ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్ప‌టికే ప్రకటించారు.
Advertisement
Prithviraj Sukumaran
Mahesh Babu
SS Rajamouli
Varanasi Movie
Kumbha Character
SSMB29

More Telugu News