మద్యం సీసాలు పెట్టి అరెస్ట్ చేశారు.. ఇది పోలీసుల నాటకం: అంబటి రాంబాబు
- స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని అంబటి ఆరోపణ
- దాచేపల్లి అభ్యర్థిని మద్యం కేసులో అక్రమంగా ఇరికించారని విమర్శ
- ఏకగ్రీవాల కోసమే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారన్న అంబటి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని అధికార కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్రలకు పాల్పడుతోందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. దాచేపల్లి నగర పంచాయతీ వైసీపీ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ మద్యం అక్రమంగా నిల్వ ఉంచారనే నెపంతో పోలీసులు సోదాలు చేసి, వారే మద్యం
సీసాలు పెట్టి నాటకీయంగా రవికుమార్‌ను అరెస్ట్ చేశారని అంబటి ఆరోపించారు. రవికుమార్ పోటీలో ఉంటే అధికార కూటమికి ఎందుకంత భయమని ఆయన ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టి, ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవడానికే ఈ అరెస్ట్ చేశారని విమర్శించారు. రవికుమార్ ఆర్థికంగా బలమైన కుటుంబానికి చెందినవారని, ఆయన తండ్రి సాంబయ్య గతంలో ఛైర్మన్‌గా పనిచేశారని గుర్తుచేశారు.
వైసీపీ అభ్యర్థులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని అంబటి మండిపడ్డారు. నామినేషన్లకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇదే ప్రభుత్వం శాశ్వతంగా ఉండదని, పోలీసుల తీరు సరికాదని హెచ్చరించారు. రక్షించాల్సిన వారే భక్షించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. వెంటనే రవికుమార్‌ను విడుదల చేసి, స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం కల్పించాలని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.