Riyan Parag: టాస్ గెలిచిన రాజస్థాన్... గిల్ లేకుండానే బరిలోకి గుజరాత్ టైటాన్స్

Rajasthan Royals Bat First Rashid Khan Captains Gujarat Titans
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య 9వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు, గుజరాత్ టైటాన్స్‌కు ఈ మ్యాచ్‌కు ముందు ఎదురుదెబ్బ తగిలింది. కండరాల నొప్పితో రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమవ్వగా, అతని స్థానంలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

టాస్ గెలిచిన అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితులను అంచనా వేసి, సుమారు 210 పరుగుల భారీ స్కోరును సాధించి, దానిని కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. అన్ని పరిస్థితుల్లోనూ రాణించగల జట్టుగా ఉండాలనుకుంటున్నామని స్పష్టం చేశాడు. జట్టులో రెండు మార్పులు చేసినట్లు చెప్పాడు. బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్ స్థానంలో తుషార్ దేశ్‌పాండే, శుభమ్ దూబే జట్టులోకి వచ్చారని వివరించాడు.

గుజరాత్ టైటాన్స్ తాత్కాలిక కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. గిల్ త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ ద్వారా కుమార్ కుశాగ్ర అరంగేట్రం చేస్తున్నాడని, అతని ఆట కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డొనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.

ఇంపాక్ట్ సబ్స్: రవి బిష్ణోయ్, లువాన్-డ్రే ప్రిటోరియస్, శుభమ్ దూబే, బ్రిజేష్ శర్మ, రవి సింగ్.

గుజరాత్ టైటాన్స్: కుమార్ కుశాగ్ర, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ (కెప్టెన్), కగిసో రబాడ, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

ఇంపాక్ట్ సబ్స్: షారుఖ్ ఖాన్, జాసన్ హోల్డర్, మానవ్ సుతార్, అనూజ్ రావత్, జయంత్ యాదవ్.
Go Back to Shorts
Riyan Parag
Rajasthan Royals
Gujarat Titans
IPL 2026
Rashid Khan
Shubman Gill
Narendra Modi Stadium
Toss
Kumar Kushagra
Cricket

More Telugu News