Chandrababu Naidu: అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లోనే రాజధాని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Says Amaravati Will Be Built on Land Given by Farmers
షార్ట్స్‌లో చూడండి
అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లోనే రాజధాని నిర్మిస్తున్నామని, రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. నిన్న ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువస్తోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం ఆడిన మూడు ముక్కలాట వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడమే కాకుండా, పెట్టుబడిదారులు కూడా దూరమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సూచించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై కూడా వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని, పూర్వోదయ పథకంతో రాయలసీమ రూపురేఖలు మారతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమావేశంలో, చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను బుధవారం నుంచి అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
 
Go Back to Shorts
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh Capital
Rayalaseema Lift Irrigation Scheme
Free Electricity Weavers
AP Politics
TDP
YS Jagan Mohan Reddy
Amaravati Farmers

More Telugu News