Bhanoo Chander Reddy: బెంగళూరులో తెలంగాణ టెక్కీ దంపతుల ఆత్మహత్య

తెలంగాణకు చెందిన టెక్కీ దంపతులు బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆ తర్వాత అతడి భార్య అపార్టుమెంట్‌లోని 17వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుంట భానుచందర్ రెడ్డి (32) బెంగళూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం, భార్య షాజియా లేనిసమయంలో భానుచందర్ రెడ్డి కొత్తనూరులోని తన అపార్టుమెంట్‌లోని ఒక గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన షాజియా గది తలుపు తట్టింది. అతను స్పందించకపోవడంతో ఆమె సెక్యూరిటీని, చుట్టుపక్కల వారిని పిలిచింది.

వారు తలుపులు బద్దలు కొట్టి చూడగా, భానుచందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో ఆ తర్వాత భార్య అపార్టుమెంట్‌లోని పదిహేడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఐబీఎంలో పని చేస్తోంది.

తన మృతికి ఎవరూ కారణం కాదని భానుచందర్ రెడ్డి సూసైడ్ నోట్ రాశాడు. పోలీసులు ఈ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. తెలంగాణలోని ఇరు కుటుంబాలు దాఖలు చేసిన ఫిర్యాదుల మేరకు పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

ఆరోగ్య సమస్యలు, సహజీవనం కారణంగా ఇబ్బందులు, మానసిక ఒత్తిడి తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భానుచందర్ రెడ్డి అనారోగ్యం కారణంగా కొన్నిరోజులుగా ఇంటివద్దే ఉంటున్నాడు. భార్య ఫ్లాట్‌లో లేని సమయంలో భర్త ఉరివేసుకున్నాడు. గతంలో సహజీవనం చేసిన వీరిద్దరు, తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారి మధ్య తరుచూ గొడవలు జరిగేదని తెలుస్తోంది.
Bhanoo Chander Reddy
Bangalore
Telangana
Techie Couple Suicide
Live-in relationship
Software Engineer

More Telugu News