Jayalalitha: హైదరాబాద్లో జయలలిత ఇంటికి సీల్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్లోని నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు. నగరంలోని ప్రముఖ ప్రాంతమైన శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ ఇంటికి సంబంధించి భారీగా పన్ను బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సుమారు రూ. 83 లక్షల మేర ఇంటి పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, తమిళనాడు ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసిన జయలలితను ప్రజలు 'పురట్చి తలైవి', 'అమ్మ' అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆమె మరణించే సమయానికి కూడా సీఎంగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జయలలితకు దేశవ్యాప్తంగా పలుచోట్ల విలువైన ఆస్తులు ఉన్న విషయం తెలిసిందే.
గతంలో ఆమెపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసు విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న బంగారం, నగదు, ఆస్తుల పత్రాలను అధికారులు ఇప్పటికే ట్రంకు పెట్టెల్లో భద్రపరిచి తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. తాజాగా హైదరాబాద్లోని నివాసానికి సంబంధించిన పన్నులు చెల్లించకపోవడంతో అధికారులు సీజ్ ప్రక్రియను పూర్తి చేశారు.