Sai Ram: కరీంనగర్ జిల్లాలో ఆర్బీఎల్ బ్రాంచీలో భారీ కుంభకోణం

Sai Ram Involved in 137 Crore RBL Bank Fraud in Karimnagar
షార్ట్స్‌లో చూడండి
కరీంనగర్ జిల్లాలోని కిసాన్‌నగర్ ఆర్బీఎల్ బ్రాంచీలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఏడు మ్యూల్ ఖాతాల ద్వారా రూ.137 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. చైనా దేశానికి చెందిన మోసగాళ్లతో కలిసి సాయిరామ్ అనే వ్యక్తి కమీషన్ మీద ఈ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

ప్రతి లావాదేవీపై క్రిప్టో కరెన్సీ ద్వారా సాయిరామ్ రెండు శాతం కమీషన్ తీసుకున్నట్లు తేలింది. ఈ బ్యాంకులో ఈ తరహా మోసానికి సంబంధించి ఎనిమిది కేసుల్లో 13 మంది నిందితులను అరెస్టు చేసినట్లు కరీంనగర్ సీపీ వెల్లడించారు. నిందితులకు కమీషన్ ద్వారా రూ.2 కోట్ల వరకు వచ్చాయని తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు ఉండటం గమనార్హం.
Go Back to Shorts
Sai Ram
Karimnagar
RBL Bank
Kisan Nagar
Financial Fraud
Crypto Currency
China

More Telugu News