వలపు వల విసిరి... రీల్స్ రాణిని ఉగ్ర ఉచ్చులోకి లాగారిలా!

Both States
Advertisement
  • భర్త వేధింపులతో పుట్టింటికి చేరిన సయీదా బేగం
  • ఇన్‌స్టా రీల్స్‌తో వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మహిళ
  • పెళ్లి పేరుతో పరిచయమై ఉగ్రవాద ఉచ్చులోకి లాగిన వ్యక్తి
  • 7 రాష్ట్రాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసి ఉగ్రవాద ప్రచారం
  • విజయవాడ పోలీసుల అరెస్ట్, వెలుగులోకి సంచలన విషయాలు
సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించి, ఇన్‌స్టా రీల్స్‌తో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకుని, చివరికి ఉగ్రవాద కార్యకలాపాల్లో చిక్కుకున్న సయీదా బేగం కథ ఇది. పాతబస్తీ చంచల్‌గూడకు చెందిన 38 ఏళ్ల సయీదా బేగం, తెలియక ఉగ్రవాదుల ఉచ్చులో చిక్కుకుందా లేక వలపు వలకు బలైందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

పదేళ్ల క్రితం విజయవాడకు చెందిన వ్యక్తితో సయీదాకు వివాహం జరిగింది. కానీ, మద్యానికి బానిసైన భర్త నిత్యం వేధించడంతో ఏడాది క్రితం ఆరేళ్ల కుమారుడితో కలిసి పుట్టింటికి వచ్చేసింది. ఇక్కడ స్థానికంగా ఇళ్లలో పనిచేస్తూ, తన తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచింది. ఈ క్రమంలో తనలోని గజల్స్ పాడే నైపుణ్యాన్ని, వంటలు, కుట్టుపనులను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రూపంలో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. అనతికాలంలోనే ఆమెకు 30 వేల మంది ఫాలోవర్లు అయ్యారు. రీల్స్ ద్వారా డబ్బులు కూడా వస్తుండటంతో దాన్నే ఆదాయ మార్గంగా మార్చుకుంది.

క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి, రెండో పెళ్లి చేసుకోవాలని సయీదాపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో, తనకు ఒక తోడు కావాలంటూ సయిదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ఇదే అదనుగా భావించిన విజయవాడకు చెందిన ఓ ఉగ్రవాది, తాను పోలీసునంటూ పరిచయం చేసుకున్నాడు. తన భార్యతో గొడవలున్నాయని, ఆమెను వదిలేసి తననే పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన సయీదా రోజూ వాట్సాప్‌లో చాటింగ్ చేసేది.

సయీదాకు ఉన్న సోషల్ మీడియా ప్రభావాన్ని గమనించిన ఆ ఉగ్రవాది ఆమెను తమ కార్యకలాపాలకు ఒక అస్త్రంగా వాడుకోవాలని ప్లాన్ చేశాడు. ఆమెను కలిసి మాటలతో ఆకట్టుకుని, తమ ఉగ్రవాద సందేశాలను ఆమె ఇన్‌స్టా ఖాతా ద్వారా ప్రచారం చేసేలా ఒప్పించాడు. విదేశీ హ్యాండ్లర్ అల్-హకీమ్ షుక్రూ మార్గదర్శకత్వంలో ఆమె సుమారు 7 రాష్ట్రాలకు చెందిన 42 మందితో ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి తీవ్రవాద ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

ఆమె కార్యకలాపాలపై నిఘా పెట్టిన విజయవాడ పోలీసులు, ఇటీవల సయీదా బేగంను అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్టుకు ముందు ఆమె తల్లిదండ్రులు ఒక పెళ్లి సంబంధం తీసుకురాగా, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనే షరతుతో ఆమె కొన్ని మెసేజ్‌లు, రీల్స్‌ను డిలీట్ చేసినట్లు సమాచారం.
Advertisement

సంబంధిత వార్తలు

Sayida BegumSayida Begum arrestISISsocial media terrorismHyderabad terrorismVijayawada policeMBTI Amjadullah Khaninstagram reelsonline radicalizationcyber crime

More Telugu News

శ్రీ సత్యసాయి బాబా జయంతి ఇకపై రాష్ట్ర పండుగ: నారా లోకేశ్

23 Nov, 11:36

పేదరికం అంటే డబ్బులు లేకపోవడమే కాదు.. లింక్డిన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి పోస్ట్‌ వైరల్

23 Nov, 11:35

బిస్లరీపై ప్రాసిక్యూషన్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి.. స్పందించిన యాజమాన్యం

23 Nov, 11:30

టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్.. డ్రా తో ముగిసిన మొదటి టెస్ట్

23 Nov, 11:28

సన్నీ డియోల్ కొడుకుతో సారా టెండూల్కర్ పెళ్లి?.. అసలు నిజమిదే!

23 Nov, 11:27

ఫోన్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి కార్మికుడి దారుణ హత్య

23 Nov, 11:25

50 లక్షల మందితో పోటెత్తనున్న అరుణాచలం.. గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తులు ఈ టైమింగ్స్ గుర్తుంచుకోండి!

23 Nov, 11:19

మానవాళికి ప్రేమ, సేవలను నేర్పిన మహనీయుడు సత్యసాయి: చంద్రబాబు

23 Nov, 11:00

ఆసీస్ జట్టు మొత్తానికీ తెలుసు.. 'శాండ్‌పేపర్‌గేట్‌'పై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు!

23 Nov, 10:33

పట్టణ జీవనంతో పేగులకు చేటు.. పెరుగుతున్న ఊబకాయం, షుగర్!

23 Nov, 10:31

ఒకవైపు ఎన్విడియా బాస్‌తో అఫైర్.. మరోవైపు చైనా నిఘా వర్గాలతో లింకులు! ఆలిస్‌పై సంచలన నివేదిక!

23 Nov, 10:25

భార‌త్‌-పాక్ 'నో హ్యాండ్‌షేక్‌'పై ఎంసీసీ ఏం చెప్పిందంటే..?

23 Nov, 10:21

అంటార్కిటికా మంచు కింద 'సూపర్ మౌంటైన్స్'.. భూమిపై జీవ పరిణామ రహస్యం వెలుగులోకి!

23 Nov, 10:18

బంగారం ధరల పతనం.. గోల్డ్ లోన్ తీసుకున్న వారికి బ్యాంకుల నోటీసులు

23 Nov, 10:16

ఫేస్‌ క్రీమ్‌ వాడితే కిడ్నీలు పాడైపోయాయి.. అసలు ఏం జరిగిందంటే..!

23 Nov, 09:56
..More Telugu News