Harish Rao: దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయి చూపించు: హరీశ్ రావుకు వేముల వీరేశం సవాల్

Veeresham Challenges Harish Rao to Prove Himself in BRS
షార్ట్స్‌లో చూడండి

బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావుపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... హరీశ్ రావు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, ఆయనకు అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విమర్శించే ముందు తన సొంత పార్టీలో తన స్థాయి ఏంటో చూసుకోవాలని హితవు పలికారు. హరీశ్ రావుకు నిజంగా దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడై చూపించాలని సవాల్ విసిరారు. సొంత పార్టీకే ప్రెసిడెంట్ కాలేని వ్యక్తి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. హరీష్ రావు మాటలు 'చిట్‌చాట్' కాదు, అవి 'చీటింగ్' మాటలని మండిపడ్డారు.


ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను 'గుండు సున్నా' చేస్తామని చెప్పి మరీ చేసి చూపించిన దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని వేముల కొనియాడారు. అసెంబ్లీ నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు బీఆర్ఎస్ 'ఖేల్ ఖతం' చేశారని, ఇప్పుడు దేశమంతా రేవంత్ వైపు చూస్తోందని అన్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. నియోజకవర్గాలు పెరిగినా, మండలాలు అటు ఇటు మారినా వచ్చే ఎన్నికల్లో రేవంత్ ఫొటో పెట్టుకునే గెలుస్తామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Harish Rao
BRS Party
Vemula Veeresham
Telangana Politics
Revanth Reddy
BRS President
Telangana Elections
Assembly Elections
Political Challenge

More Telugu News