Shane Warne: రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్ వార్న్ కుటుంబానికి రూ.460 కోట్ల జాక్‌పాట్!
ఐపీఎల్ తొలి ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం చేతులు మారడం ఆ జట్టు దివంగత కెప్టెన్ షేన్ వార్న్ కుటుంబానికి ఊహించని జాక్‌పాట్ తెచ్చిపెట్టనుంది. ఇటీవల అమెరికాకు చెందిన ఓ కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని ఏకంగా 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.15,286 కోట్లు) కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద అమ్మకాల్లో ఒకటిగా నిలిచిన ఈ డీల్ ద్వారా, వార్న్ కుటుంబానికి సుమారు రూ.460 కోట్లు అందనున్నాయి.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు రాజస్థాన్ రాయల్స్ తొలి యజమానులతో షేన్ వార్న్ ఓ అద్భుతమైన ఒప్పందం చేసుకున్నాడు. తాను జట్టు తరఫున ఆడే ప్రతి సీజన్‌కు 0.75% ఈక్విటీ (వాటా)ను జీతంతో పాటు అదనంగా తీసుకునేలా ఆయన డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వార్న్ రాజస్థాన్ తరఫున నాలుగు సీజన్లు (2008-2011) ఆడాడు. ఈ లెక్కన ఫ్రాంచైజీలో ఆయనకు మొత్తం 3% వాటా లభించింది. ఇప్పుడు ఫ్రాంచైజీ రూ.15,286 కోట్లకు అమ్ముడుపోవడంతో ఆ 3% వాటా విలువ సుమారు రూ.460 కోట్లుగా తేలింది.
ఐపీఎల్ తొలి వేలంలో వార్న్‌ను రాజస్థాన్ ఫ్రాంచైజీ కేవలం 4 లక్షల డాలర్ల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. నాలుగు సీజన్లకు కలిపి ఆయన జీతంగా సుమారు రూ.9 కోట్లు మాత్రమే అందుకున్నారు. కానీ, ఇప్పుడు ఈక్విటీ రూపంలో ఆయన కుటుంబానికి వందల కోట్లు రానుండటం ఆయన ముందుచూపునకు, వ్యాపార దక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. 2022లో వార్న్ అకాల మరణం చెందిన నేపథ్యంలో ఈ భారీ మొత్తం ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు చెందనుంది.
షేన్ వార్న్ కేవలం ఆటగాడిగానే కాకుండా రాజస్థాన్ జట్టుకు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాడు. 2008లో ఎవరూ ఊహించని విధంగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టును తన అద్భుతమైన కెప్టెన్సీతో తొలి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిపాడు. రాజస్థాన్ తరఫున 55 మ్యాచ్‌లు ఆడి 57 వికెట్లు పడగొట్టాడు. ఈ వార్త బయటకు రావడంతో మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా వార్న్ నిజమైన లెజెండ్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.