Kondisa Ngwenya: 2027 వన్డే వరల్డ్ కప్‌కు సీఈవో, సీఓఓల నియామకం
2027లో జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి కీలక నియామకాలు జరిగాయి. టోర్నమెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా కొండిసా గ్వెన్యా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా ఎడ్వర్డ్ ఖోజా నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ (ఎల్ఓసీ) శనివారం అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఈ నియామకాలపై ఆర్గనైజింగ్ కమిటీ బోర్డు ఛైర్మన్ ట్రెవర్ మాన్యువల్ హర్షం వ్యక్తం చేశారు. "కొండిసా, ఎడ్వర్డ్‌లకు స్వాగతం. ఇంత భారీ క్రీడా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించగల నైపుణ్యం, అనుభవం వారికి ఉన్నాయి. వారి సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామక ప్రక్రియకు మద్దతిచ్చిన క్రికెట్ సౌత్ ఆఫ్రికాకు, ఆమోదం తెలిపిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
2027 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ 14వ ఎడిషన్ వన్డే ప్రపంచకప్ జరగనుంది. 2003 తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి కాగా, నమీబియా తొలిసారిగా ప్రపంచకప్ మ్యాచ్‌లకు వేదిక కానుంది. టోర్నీలోని 44 మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో, మిగిలిన 10 మ్యాచ్‌లు జింబాబ్వే, నమీబియాలలో జరుగుతాయి.
ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు టోర్నీలో నేరుగా ప్రవేశం లభిస్తుంది. 2027 మార్చి 31 నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచే జట్లు కూడా నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫయింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. అయితే, సహ-ఆతిథ్య దేశమైనప్పటికీ, ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యదేశం కాకపోవడంతో నమీబియా తప్పనిసరిగా క్వాలిఫయర్స్ ఆడి అర్హత సాధించాల్సి ఉంటుంది.