Laxman Sivaramakrishnan: కామెంటేటర్‌గా రాజీనామా చేస్తున్నా: బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ పోస్టు

Laxman Sivaramakrishnan Resigns as Commentator Alleging BCCI Neglect
షార్ట్స్‌లో చూడండి
బీసీసీఐ తనను రెండు దశాబ్దాలుగా విస్మరిస్తోందని, ఈ క్రమంలో కామెంటేటర్‌గా రాజీనామా చేస్తున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన ప్రకటన చేశాడు. 1985లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన లక్ష్మణ్ శివరామకృష్ణన్ నాటి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 1980లలో 9 టెస్టులు, 16 అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. గత ఇరవై మూడేళ్లుగా బీసీసీఐ కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.

బీసీసీఐ కామెంటేటర్ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు శివరామకృష్ణన్ తాజాగా సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించాడు. 23 ఏళ్లుగా బీసీసీఐ తనను నిర్లక్ష్యం చేస్తోందని వాపోయాడు. తన పాత్రను పరిమితం చేసేలా వ్యవహరించిందని ఆరోపించాడు. ఇన్నేళ్లుగా బీసీసీఐతోనే ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా కీలక బాధ్యతలు అప్పగించలేదని వాపోయాడు. తనను ఎప్పుడూ పెద్ద మ్యాచ్ లకు టాస్ వేయడం, అవార్డు ప్రజెంటేషన్ వంటి వాటికి ఉపయోగించుకోలేదని అన్నాడు.

తన తర్వాత వచ్చిన ఎందరికో ఇలాంటి అవకాశాలు వచ్చాయని తెలిపాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలోనూ కొత్త వాళ్లతోనే పిచ్ రిపోర్టు ప్రజెంటేషన్ చేయించిందని వాపోయాడు. ముఖ్యమైన అంశాల్లో తనను ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కావడం లేదని అన్నాడు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పనిచేయనని పేర్కొన్నాడు. సాధారణ ప్రజలు, క్రికెట్ అభిమానులు తన నిర్ణయంతో షాక్ అవుతారని తెలుసని అన్నాడు.

నన్ను ద్వేషించేవారు సంతోషిస్తారని, వారి సంతోషం పట్ల తాను ఆనందంగా ఉంటానని అన్నాడు. తనను మంచివాడిగా భావించినవారు ఉంటారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించాడు. లక్ష్మణ్ శివరామకృష్ణన్ పోస్టుపై రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, 'వద్దు' అని సూచించాడు.
Go Back to Shorts
Laxman Sivaramakrishnan
BCCI
commentator resignation
cricket
Indian cricket
Ravi Shastri

More Telugu News