Mallu Bhatti Vikramarka: ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 3

Telangana Budget 2024 Rs 50713 Crore for Six Guarantees
షార్ట్స్‌లో చూడండి
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను తెలంగాణ డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ 3,24,234 కోట్లతో బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మల్లు భట్టి తెలిపారు.

బడ్జెట్ వివరాలు:
  • ఆరు గ్యారెంటీలకు రూ. 50,713 కోట్లు
  • సంక్షేమం, అభివృద్ధికి రూ. 1,45,592 కోట్లు
  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల కవరేజ్
  • జూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు
  • 2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు
  • చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ. 400 కోట్లు 
  • దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ
  • వెల్ఫేర్ స్కూల్స్‌లో వసతుల కల్పనకు రూ. 100 కోట్లు
  • 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడేషన్
  • విద్యాశాఖ పరిధిలోకి స్కిల్ యూనివర్సిటీ
  • విదేశాల్లో యువతకు ఉపాధి అవకాశాల కోసం కొత్తగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ కార్యక్రమం
  • భూ భారతి చట్టం - 2025 అమలు
  • ఏఐ ఆధారిత ‘భూ మిత్ర’ చాట్‌బాట్ ప్రవేశపెట్టడం
  • డ్వాక్రా మహిళలకు రూ. 2,500 కోట్ల వడ్డీ లేని రుణాలు 
  • ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టే వారి రుణ వడ్డీ కోసం రూ.350 కోట్లు
  • ఆలయాల అభివృద్ధికి రూ. 440 కోట్లు
  • హెచ్ఎండీఏ అభివృద్ధికి రూ. 500 కోట్లు
  • మిషన్ భగీరథ అర్బన్ కు రూ. 500 కోట్లు
  • క్యూర్ ఏరియా అభివృద్ధికి రూ. 2,654 కోట్లు
  • పెట్రోల్, డీజీల్ ఆటోలు ప్రభుత్వ ఖర్చుతో ఈవీలుగా మార్పు
  • కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం
  • షెడ్యూల్ తెగలకు 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు.
Go Back to Shorts
Mallu Bhatti Vikramarka
Telangana Budget 2024
Telangana Budget
Indiramma Kutumba Jeevitha Bima
Telangana Assembly
Welfare Schemes
chakali ailamma university
CM Overseas Employment
Bhoo Bharathi Law

More Telugu News