BCCI: వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్‌పై సెలక్టర్ల కన్ను
వన్డే ప్రపంచకప్ 2027 టోర్నమెంట్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, బీసీసీఐ ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ మెగా టోర్నీ కోసం సుమారు 20 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను సెలక్టర్లు ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా గమనించాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పీటీఐ ఒక కథనంలో పేర్కొంది.
సెలెక్షన్ కమిటీ సభ్యులు ఎస్ఎస్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రగ్యాన్ ఓఝా.. ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా స్టేడియాల్లోనూ, టీవీల్లోనూ పర్యవేక్షించనున్నారు. ప్రతీ వారం కనీసం ఐదు మ్యాచ్‌లను కవర్ చేసేలా, ఒక్కో సెలక్టర్ ఒక్కో మ్యాచ్‌కు హాజరయ్యేలా ప్రణాళిక రచించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ పర్యవేక్షణ కేవలం వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే జరుగుతుందని, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లేదా టీ20 ప్రపంచకప్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టమైంది.
సెలక్టర్లు ప్రధానంగా జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లపై దృష్టి సారించనున్నారు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న హర్షిత్ రాణాకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
మరోవైపు జూన్ 6 నుంచి 10 వరకు ముల్లన్‌పూర్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు పూర్తిస్థాయి జట్టును పంపాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లు లేనప్పటికీ, దీనిని తేలిగ్గా తీసుకోవడం లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు భారత్ తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉన్నందున, ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే ఉద్దేశం లేదని తెలుస్తోంది. ఐపీఎల్ సమయంలో గాయపడకపోతే బుమ్రా, సిరాజ్ కూడా ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టు ఆడే జట్టులో ఉంటారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. "భారత టెస్టు జట్టు ప్రయోగాలకు వేదిక కాదు. దానికోసం ఇండియా-ఏ పర్యటనలు ఉన్నాయి. ప్రస్తుతం టెస్టుల్లో బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మా మొదటి ప్రాధాన్యత" అని బీసీసీఐ అధికారి ఒకరు వివరించారు.