Iran Israel war: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి

Iran Israel War 26 Lakh Indians Evacuated
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా నుంచి ఇప్పటి వరకు 2.6 లక్షల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. పశ్చిమాసియాలో 19 రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లోని భారతీయులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రెండు లక్షలకు పైగా భారతీయులను సురక్షితంగా తీసుకువచ్చింది.

యూఏఈ నుంచి భారత్‌లోని వివిధ విమానాశ్రయాలకు 70 సర్వీసులు నడుస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి మన పౌరులు, విద్యార్థులకు సహాయం అందిస్తోందని వెల్లడించింది. చాలామంది భారతీయులు ఇరాన్ సరిహద్దు దాటి అర్మేనియా, అజర్‌బైజాన్‌లకు వెళ్లాలని భావిస్తున్నారని తెలిపింది.

గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ యువరాజుతో ఫోన్‌లో సంభాషించారు. కువైట్‌పై దాడులను భారత్ ఖండిస్తున్నట్లు తెలిపారు. హర్మూజ్ జలసంధి ద్వారా నౌకలు సురక్షితంగా, స్వేచ్ఛగా వెళ్లేలా చూడాలని అన్నారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి నిరంతరం దౌత్య చర్చలు అవసరమని పేర్కొన్నారు.
Go Back to Shorts
Iran Israel war
Indian evacuation
West Asia conflict
Narendra Modi
MEA
Gulf countries
UAE

More Telugu News