Iran: సౌదీ, ఖతార్, యూఏఈలోని చమురు, గ్యాస్ కేంద్రాలపై కొన్నిగంటల్లో దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక

Iran Warns of Attacks on Saudi Qatar UAE Oil Gas Centers
షార్ట్స్‌లో చూడండి
సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్‌లోని చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది. గల్ఫ్ దేశాల్లోని తమ కేంద్రాల నుంచి అమెరికా తమపై దాడులు చేస్తుండటంతో, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ మేరకు ఆ దేశానికి చెందిన టెహ్రాన్ టైమ్స్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. పొరుగున ఉన్న దేశాల్లోని చమురు, గ్యాస్ కేంద్రాలపై మరికొన్ని గంటల్లో దాడులు చేయనున్నట్లు తెలిపింది.

ఇరాన్‌లోని అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ ఫార్స్ మౌలిక సదుపాయాలపై దాడి జరిగింది. దీనికి ఇజ్రాయెల్, అమెరికా కారణమని ఇరాన్ ఆరోపించింది. అలాగే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్, సీనియర్ భద్రతా అధికారి అలీ లారిజానీ, బసీజ్ ఫోర్స్ అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ మృతి చెందారు. తమ దేశానికి చెందిన కీలక నాయకులు మృతి చెందడంతో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేస్తోంది.
Go Back to Shorts
Iran
Saudi Arabia
Qatar
UAE
Oil attacks
Gas attacks
Middle East conflict
US Iran tensions
Israel Iran conflict

More Telugu News