Seethakka: మహిళలపై కేటీఆర్‌కు చిన్నచూపు: మంత్రి సీతక్క

Seethakka Slams KTR for Disrespecting Women
షార్ట్స్‌లో చూడండి

తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరును మంత్రి సీతక్క తీవ్రంగా తప్పుపట్టారు. మహిళల పట్ల కేటీఆర్‌కు చిన్నచూపు ఉందని, బయటి మహిళలైనా లేదా సొంత కుటుంబ సభ్యులైనా సరే.. వారిని ఎదగనివ్వాలనే ఆలోచన ఆయనకు లేదని చురకలంటించారు. ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ గతంలో చేసిన సెటైర్లను, తప్పుడు ప్రచారాన్ని ఆమె ఈ సందర్భంగా ఎండగట్టారు. అసలు పదేళ్ల పాటు మంత్రిగా ఉండి మహిళల కోసం ఆయన ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు చెందిన 'అభయ హస్తం' నిధులను కూడా వాడుకుందని, మహిళా సంఘాలపై రూ.3,000 కోట్ల భారం వేసి పోయిందని సీతక్క ఆరోపించారు. తాము శ్రీనిధి ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు కూడా కేటీఆర్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు గోబెల్స్ ప్రచారంలో ప్రపంచంలోనే అందరికంటే ముందుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే మీరు ఎక్కడ ఉండేవారో ఆత్మపరిశీలన చేసుకోవాలని ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో పావలా వడ్డీ పథకం కూడా సరిగ్గా ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై హేళనగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

Go Back to Shorts
Seethakka
KTR
Telangana Assembly
BRS
Telangana Congress
Free Bus Travel
Abhaya Hastham
Sridhar Babu
Telangana Politics
Women Empowerment

More Telugu News