Monalisa Bhonsle: నా సినిమాను దెబ్బతీయడానికే మోనాలిసా పెళ్లి.. దర్శకుడి సంచలన ఆరోపణలు
'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమాతో తాను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న నటి మోనాలిసా భోంస్లే వయసుపై ఫిల్మ్ మేకర్ సనోజ్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మైనర్ అని, ఆమె వయసుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇటీవల మోనాలిసా వివాహం చేసుకోవడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.
ఈ విషయంపై సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. మహాకుంభ్ సమయంలో మోనాలిసా వయసు సుమారు 16 సంవత్సరాలేనని, పెళ్లి కోసం ఆమె వయసు పత్రాలను తారుమారు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. "మోనాలిసా అసలు వయసును నిర్ధారించేందుకు మెడికల్ పరీక్షలు జరపాలని డిమాండ్ చేసేందుకు నేను మహేశ్వర్ వెళ్లి ఆమె కుటుంబాన్ని కలుస్తాను" అని ఆయన తెలిపారు.
ఈ పెళ్లి తన సినిమా ప్రాజెక్టును దెబ్బతీయడానికి పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర అని సనోజ్ మిశ్రా ఆరోపించారు. మోనాలిసా తన సినిమాలో నటించకుండా ఉండేందుకే కొన్ని బృందాలు ఈ పెళ్లిని జరిపించాయని ఆయన అన్నారు.
ఒకవేళ వైద్య పరీక్షల్లో మోనాలిసా మైనర్ అని తేలితే, ఆమె భర్త ఫర్మాన్‌తో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతరులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితమే మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కేరళలో వివాహం చేసుకుంది. అయితే, జనవరిలోనే ఆమెకు 18 ఏళ్లు నిండాయని కుటుంబ సభ్యులు, పోలీసులు చెబుతున్న నేపథ్యంలో దర్శకుడి ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.