- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని మహేశ్ గౌడ్ ధీమా
- తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్య
- ఆలోచన లేకుండా అప్పులు చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని ముంచారని ఆరోపణ
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఇంకా భ్రమల్లోనే జీవిస్తున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను వారు గ్రహించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మేధావి అని చెప్పుకునే కేసీఆర్ ఎలాంటి ఆలోచన లేకుండా అప్పులు చేశారని మహేశ్ గౌడ్ విమర్శించారు. ఎల్ నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటే, దాని గురించి హరీశ్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, 90,000 ఉద్యోగాలు పొందిన ప్రతి లబ్ధిదారుడు కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని... క్షేత్రస్థాయిలో తమ పార్టీ బలంగా ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని... దేశంలో ఎక్కడా లేనంతగా తమ పార్టీలో సమన్వయం ఉందని మహేశ్ గౌడ్ తెలిపారు. నవంబర్‌లో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఆ తర్వాత తమ ప్రత్యక్ష లక్ష్యం ఎన్నికలేనని స్పష్టం చేశారు.
రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, ఆ పార్టీ పని అయిపోయిందని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఉన్న 8 ఎంపీ సీట్లలో రెండు కూడా గెలవడం కష్టమేనని.. మరోవైపు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా గెలవరని అన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40 శాతం సీట్లు తమకే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.