'కేరళ స్టోరీ' సినిమాను ఎవరూ చూడటం లేదన్న రాహుల్ గాంధీ... బీజేపీ ఎంపీ భార్య కౌంటర్
- నిజమైన కేరళ సంస్కృతి, సంప్రదాయాలు ప్రజలకు తెలుసన్న రాహుల్ గాంధీ
- రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ ఎంపీ భార్య
- ఇంట్లో కూర్చుని మాట్లాడటం సరికాదన్న సురభి తివారీ
కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, అలాంటి కార్యకలాపాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కూడా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవతలి వారికి సమాధానం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వరని విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ స్పందించారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సురభి తివారీ తప్పుబట్టారు. ఇంట్లో కూర్చుని ఇలాంటి మాటలు మాట్లాడటం సరైన విధానం కాదని హితవు పలికారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాక, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, కేసులు చదివిన తర్వాత అది నిజమో కాదో ప్రజలే తేల్చుకుంటారని అన్నారు.