2024-25లో జాతీయ పార్టీల ఆదాయంలో బీజేపీ టాప్

National
Advertisement
  • అన్ని పార్టీలకు రూ.7,960.09 కోట్ల ఆదాయం సమకూరగా, 85 శాతం బీజేపీ ఖాతాలోకి!
  • రూ.918 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో కాంగ్రెస్
  • ఆదాయం కంటే అధికంగా ఖర్చు చేసిన కాంగ్రెస్, బీఎస్పీ
Advertisement
2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలలో బీజేపీ అత్యధిక ఆదాయాన్ని నివేదించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. దేశంలోని ఆరు జాతీయ పార్టీలకు ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.7,960.09 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపింది. ఇందులో 85.03 శాతం వాటా బీజేపీ ఖాతాలోకి వెళ్లినట్లు పేర్కొంది. ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు సమర్పించిన ఆడిట్ నివేదికల ఆధారంగా ఏడీఆర్ ఈ లెక్కలను వెల్లడించింది

ఈ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.6769.14 కోట్ల ఆదాయం సమకూరింది. 918.28 కోట్ల ఆదాయంతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాత 172.60 కోట్లు సీపీఎంకు, రూ.58.58 కోట్లు బీఎస్పీకి, రూ.39.28 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి, రూ.2.18 కోట్లు నేషనల్ పీపుల్స్ పార్టీకి సమకూరాయి.

బీజేపీ తన ఆదాయంలో 55.76 శాతం అంటే రూ.3,774.58 కోట్లు, కాంగ్రెస్ రూ.1111.94 కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఖర్చు మొత్తం ఆదాయం కంటే 21.09 శాతం ఎక్కువ. బీఎస్పీ కూడా తనకు సమకూరిన ఆదాయం కంటే 81 శాతం అదనంగా ఖర్చు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఆదాయంలో 92.83 శాతం ఖర్చు చేసింది.

2023-24, 2024-25 మధ్య కాలంలో బీజేపీ ఆదాయం 55.95 శాతం పెరగగా, కాంగ్రెస్ ఆదాయం 25.05 శాతం తగ్గింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆదాయం 73.20 శాతం పెరిగింది. ఆరు జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో 85.08 శాతం విరాళాల రూపంలోనే వచ్చింది. బీఎస్పీకి మాత్రం తన ఆదాయంలో 100 శాతం ఇతర మార్గాల్లో వచ్చింది.
Advertisement

సంబంధిత వార్తలు

BJPBharatiya Janata PartyNational Parties IncomeCongressIndian National CongressElection Commission

More Telugu News

ఎన్నికల విధుల్లో టీచర్ మృతి.. చంద్రబాబు, నారా లోకేశ్ తీవ్ర విచారం

05 Nov, 19:22

ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భారత్-శ్రీలంక తొలి వన్డే ఢిల్లీ నుంచి విశాఖకు మార్పు

05 Nov, 19:10

ఓటు వేయని జగన్‌కు ఎన్నికలపై మాట్లాడే నైతిక హక్కు లేదు: ధూళిపాళ్ల నరేంద్ర

05 Nov, 18:56

కనిపించకుండా పోయిన చిలుక ఆచూకీ చెప్పండి.. లక్ష రివార్డ్ పొందండి!

05 Nov, 18:45

'హోం రాడికలైజేషన్'.. యువత తల్లిదండ్రులే ఉగ్రవాదుల కొత్త ఆయుధం!

05 Nov, 18:17

ఏపీలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. ఎల్లుండి కౌంటింగ్

05 Nov, 18:11

బీసీ సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆత్మగౌరవ భవనాలకు భారీగా నిధులు

05 Nov, 17:57

బాబర్ ఆజంతో ఇబ్బంది లేదు.. అతడి అభిమానులే విషపూరితం: అజామ్ ఖాన్

05 Nov, 17:50

కొఠియా గ్రామాల్లో ఓటర్లను అడ్డుకుంటున్న ఒడిశా పోలీసులు.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వార్నింగ్

05 Nov, 17:20

ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రిటైర్‌.. 23 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

05 Nov, 17:17

ఫలితాలు తేడాగా వస్తాయని చంద్రబాబుకు భయం పట్టుకుంది: వల్లభనేని వంశీ

05 Nov, 17:11

గూగుల్‌ ఫొటోస్‌లో కీలక మార్పు.. డిలీట్‌ చేసిన ఫొటోలు 30 రోజులే!

05 Nov, 17:07

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఓటమి భయంతోనే వైసీపీ అరాచకాలు: పల్లా

05 Nov, 16:45

ఈ సినిమాలో యాక్టర్లందరికీ మంచి పేరొస్తుంది: 'సమ్మర్ హాలిడేస్' దర్శకుడు శ్రీకర్ నయన్

05 Nov, 16:34

మురిసిన మార్కెట్లు.. మదుపర్లకు రూ.8 లక్షల కోట్ల లాభం!

05 Nov, 16:30
..More Telugu News