గచ్చిబౌలిలో కానిస్టేబుల్‌ను బానెట్ పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. వీడియో ఇదిగో!
- నానక్ రామ్ గూడా వద్ద మరో కారును ఢీ కొట్టిన డ్రైవర్
- కారును ఆపకుండా పరారయ్యేందుకు ప్రయత్నం
- ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్
ఓపక్క బానెట్‌పై కానిస్టేబుల్ వేలాడుతున్నా, నిందితుడు అలాగే కారును దాదాపు 800 మీటర్ల వరకు అతివేగంగా తీసుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన తోటి వాహనదారులు కారును అడ్డుకోవడంతో కానిస్టేబుల్ ప్రాణాలతో బయటపడ్డారు. నిందితుడిని నార్సింగికి చెందిన తరుణ్ (24)గా గుర్తించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతడు 160 ఎంజీ వరకు మద్యం సేవించినట్లు తేలింది. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. కారును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.