Anvesh: 'నా అన్వేషణ' యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు
- భక్తుల మనోభావాలు దెబ్బతీశాడని పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు
- ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి కల్యాణి
- తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
'నా అన్వేషణ' యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అతడు వీడియో విడుదల చేశాడంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు.
విశాఖపట్నంకు చెందిన అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అతడు కొద్ది రోజుల క్రితం వీడియోను విడుదల చేశాడు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల అన్వేష్ అకౌంట్‌ను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. తన ఖాతాను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేయడాన్ని అన్వేష్ తేలిగ్గా తీసుకున్నాడు. తనకు యూట్యూబ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయని ఈ ఖాతా పోతే తనకు వచ్చే నష్టమేమీ లేదని తెలిపాడు. ఆయన మరో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో పాటు యూట్యూబ్‌ను కూడా బ్లాక్ చేయాలని పోలీసులు లేఖ రాయనున్నారు.