గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడి నడిరోడ్డుపై భారీ పేలుడు.. వీడియో ఇదిగో!
- అక్కడికక్కడే నలుగురు మృతి.. మరో 17 మందికి తీవ్ర గాయాలు
- చిలీలో ఘోర ప్రమాదం.. వైరల్ గా మారిన వీడియోలు
- రహదారిపై ప్రయాణిస్తున్న 50 వాహనాలు ధ్వంసం
భారీ పేలుడు..
పేలుడు తీవ్రతకు 150 నుంచి 200 మీటర్ల పరిధిలోని 50 వాహనాలు దెబ్బతిన్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఎగిసిపడిన శకలాలు మూడు వ్యాపార సంస్థల ప్రాంగణాల్లో పడ్డాయని చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ తెలిపారు. శాంటియాగో గవర్నర్ క్లాడియో ఒరెగో సమాచారం ప్రకారం.. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. "ఒక వ్యక్తి శరీరం 100 శాతం కాలిపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు" అని గవర్నర్ పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి.