'స్నాక్' ఫుడ్ డెలివరీ యాప్‌ను మూసివేసిన స్విగ్గీ

Swiggy Shuts Down Snack Food Delivery App
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తన 15 నిమిషాల ఫుడ్ డెలివరీ యాప్ 'స్నాక్' సేవలను ప్రారంభించిన ఏడాదిలోనే మూసివేసింది. తీవ్ర పోటీ, పెరుగుతున్న నష్టాల కారణంగా 'స్నాక్'ను మూసివేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోవడంతో కార్యకలాపాలను నిలిపివేసింది. దీర్ఘకాలంలో వృద్ధికి అవకాశం ఉన్న వ్యాపారాలపై దృష్టి సారించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్విగ్గీ కంపెనీ అంతర్గత ఈ-మెయిల్‌లో పేర్కొంది.

క్విక్ కామర్స్ సంస్థలైన జెప్టో 'కేఫ్', బ్లింకిట్ 'బిస్ట్రో'ను ప్రారంభించడంతో స్విగ్గీ కూడా 'స్నాక్‌'ను ప్రారంభించింది. స్నాక్స్, బేవరేజెస్, మినీ మీల్స్, కేక్స్, కుకీస్ వంటివి దీని ద్వారా విక్రయిస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లకు సరఫరా చేసే వెండర్ల నుంచి ఈ సంస్థలు ఆహార పదార్థాలను సేకరించి డార్క్ స్టోర్ నుంచి సరఫరా చేస్తుంటారు. పరిమిత సంఖ్యలో సేల్స్, లాభదాయకంగా లేకపోవడం వంటి కారణాలతో ఈ ప్లాట్ ఫామ్ ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నది.
Go Back to Shorts
Swiggy
Swiggy Snack
Food Delivery App
Quick Commerce
Zepto Cafe
Blinkit Bistro
Snacks Beverages

More Telugu News