పదవులపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- పదవులు శాశ్వతం కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- తనకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమన్న రాజగోపాల్ రెడ్డి
- తనకు పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదని వ్యాఖ్య
తనకు మంత్రి పదవి ఇవ్వాలని, ఆ హామీతోనే తాను పార్టీలోకి వచ్చానని ఆయన ఇటీవల వెల్లడించారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని లేదంటే ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అడగబోనని, కానీ తనకూ ఒకరోజు వస్తుందని, ఆ రోజు లాక్కుంటానని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఒక్కరే కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, పార్టీలోని వారంతా శ్రమించారని అన్నారు.
అయితే, మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.