Sumit Kumar: కారులో ప్రేమజంట అనుమానాస్పద మృతి

Noida couple Sumit Kumar Rekha dead in suspected murder suicide
షార్ట్స్‌లో చూడండి
లాక్ చేసి ఉన్న కారులో ఒక యువకుడు, యువతి తుపాకీ గాయాలతో మరణించి కనిపించడం నోయిడాలో తీవ్ర కలకలం రేపింది. ప్రియురాలిని కాల్చి చంపి, ప్రియుడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ఇది పరువు హత్య కావచ్చనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ఘటన మిస్టరీగా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

శనివారం మధ్యాహ్నం నోయిడా సెక్టార్ 107లో అనుమానాస్పదంగా ఆగి ఉన్న కారును స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా, కారు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. అద్దాలు పగలగొట్టి చూడగా ఢిల్లీకి చెందిన సుమిత్ కుమార్ (32), నోయిడా వాసి అయిన రేఖ (28) తలలకు బుల్లెట్ గాయాలతో విగతజీవులుగా పడి ఉన్నారు. సుమిత్ చేతిలో ఒక పిస్టల్ లభించింది.

పోలీసుల కథనం ప్రకారం సుమిత్ ఫోన్‌లో లభించిన ఒక వాట్సాప్ సందేశంలో... 15 ఏళ్లుగా ప్రేమించుకున్న రేఖ, ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోబోతోందని, అందుకే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు రాసి ఉంది. అయితే, మృతురాలి కుటుంబం మాత్రం సుమిత్ తమ కుమార్తెను వేధించేవాడని, కులాలు వేరు కావడంతో తాము ఆమెకు వేరే సంబంధం చూస్తున్నామని తెలిపింది.

ఇది పరువు హత్యేనని సుమిత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కులం పేరుతో రేఖ కుటుంబం నుంచి తమకు బెదిరింపులు వచ్చాయని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలోని 50కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని, ఇద్దరి మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు కచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Sumit Kumar
Noida
love couple
murder suicide
honor killing
crime news
police investigation
whatsapp message
Rekha
sector 107

More Telugu News