Perni Nani: పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు

Perni Nanis Quash Petition Dismissed by AP High Court
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించిన అంశానికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పేర్ని నాని క్వాష్ పిటిషన్ వేశారు. 

ఈ పిటిషన్ ను నిన్న విచారించిన హైకోర్టు పేర్ని నానికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పేర్ని నానిపై నమోదైన కేసులు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని... క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 35(3) ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చి, విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.
Go Back to Shorts
Perni Nani
AP High Court
Chandrababu Naidu
Pawan Kalyan
YSRCP
Machilipatnam
Andhra Pradesh Politics
Defamation Case

More Telugu News