Kiren Rijiju: విపక్ష ఎంపీల తీరుపై మరో వీడియో రిలీజ్ చేసిన కిరణ్ రిజిజు
- స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్ లో విపక్ష ఎంపీల దౌర్జన్యమంటూ విమర్శ
- స్పీకర్ ను, ప్రధానిని దుర్భాషలాడారని ఆరోపణ
- ఫిబ్రవరి 4న జరిగిన సంఘటనపై మరో వీడియో విడుదల
పార్లమెంట్ లో కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల ప్రవర్తనపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 4న లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీల రగడ అందరూ చూశారని అన్నారు. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్ లోకి దూసుకెళ్లి మరీ ఆయనను, ప్రధాని మోదీని కాంగ్రెస్ ఎంపీలు దుర్భాషలాడారని ఆరోపించారు. సభలో విపక్ష ఎంపీలు చేసిన రగడకు సంబంధించిన వీడియోను ఇప్పటికే రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి.. తాజాగా స్పీకర్ ఛాంబర్ లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను ఈ రోజు ఉదయం ఎక్స్ లో పోస్ట్ చేశారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చేపట్టిన చర్చలో ప్రధాని మోదీని చుట్టుముట్టే ప్రయత్నం జరిగిందని స్పీకర్ ఓం బిర్లా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విశ్వసనీయ సమాచారం అందడంతో ప్రధాని మోదీని సభకు రావొద్దని తానే సూచించినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయంపై కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు లోక్ సభలో తీవ్ర ఆందోళన చేశారు.
అనంతరం స్పీకర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లి అక్కడ కూడా గందరగోళం సృష్టించారు. కిరణ్ రిజిజు షేర్ చేసిన తాజా వీడియోలో.. స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్ లోపల పెద్ద సంఖ్యలో ఎంపీలు గట్టిగా మాట్లాడటం కనిపిస్తోంది. కిరణ్ రిజిజు సహా పలువురు కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ ఎంపీలు మరో పక్క నిల్చుని ఉండడం చూడొచ్చు.
ఎంపీల బెదిరింపులు.. కిరణ్ రిజిజు
స్పీకర్ ఛాంబర్ లో జరిగిన ఉదంతానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఛాంబర్ లో ఆయన అనుమతి లేకుండా వీడియో తీయడం చట్టవిరుద్ధమని, ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ ఒకరు తీశారని కేంద్ర మంత్రి చెప్పారు. దాదాపు 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్ లో గట్టిగా మాట్లాడుతుండటం ఈ వీడియోలో చూడొచ్చని అన్నారు.
స్పీకర్ ను దుర్భాషలాడటంతో పాటు ప్రధాని మోదీపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఎంపీలు ఇలా బెదిరింపులకు పాల్పడటాన్ని తాము ఎప్పటికీ ప్రోత్సహించబోమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ పోస్టులో పేర్కొన్నారు.