యూపీలో కానిస్టేబుల్ చేతివాటం.. వీడియో ఇదిగో!
- మొబైల్ షాప్ లో ఐఫోన్ ప్రో మాక్స్ ఫోన్ కొట్టేసిన వైనం
- చోరీ గుర్తించకుండా ఉండేందుకు తన పాత ఐఫోన్ వదిలేసి వెళ్లిన కానిస్టేబుల్
- సీసీటీవీ ఫుటేజీ పరిశీలించడంతో బయటపడ్డ దొంగతనం
దొంగలను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాల్సిన ఓ కానిస్టేబుల్ తానే దొంగతనం చేశాడు. మరో కానిస్టేబుల్ తో కలిసి ఖరీదైన ఫోన్ ను కొట్టేశాడు. మొబైల్ కొనడానికి వెళ్లి షాపులో చేతివాటం ప్రదర్శించాడు. ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
జౌన్ పూర్ కు చెందిన కానిస్టేబుళ్లు ధనంజయ్ బింద్, మిథిలేశ్ యాదవ్ ఈ నెల 7న జేసీ ఇంటర్ సెక్షన్ ఏరియాలోని ఓ మొబైల్ షాప్ కు వెళ్లారు. కొత్త ఐఫోన్ కొనుగోలు చేసేందుకు వచ్చామని చెప్పడంతో షాపులోని యువతి వారికి వివిధ మోడల్స్ చూపించింది. దాదాపు 20 నిమిషాలపాటు ఆ ఫోన్లను పరిశీలించిన ధనంజయ్, మిథిలేశ్.. చివరకు ఏదీ నచ్చలేదని వెళ్లిపోయారు. అయితే, ఫోన్లను పరిశీలిస్తున్నప్పుడే ఇద్దరిలో ఒకరు చాలా నేర్పుగా ఐఫోన్ ప్రో మ్యాక్స్ ను తన జేబులో పెట్టేసుకున్నాడు. దాదాపు రూ.1.60 లక్షలు విలువ చేసే ఫోన్ ను కాజేశాడు.
తన చేతివాటం వెంటనే బయటపడకుండా ఉండేందుకు తన పాత ఐఫోన్ ను అక్కడి కొత్త ఫోన్లలో కలిపేశాడు. కౌంటర్ ముందు ల్యాప్ టాప్ అడ్డుగా ఉండడంతో షాపులో యువతి ఇది గుర్తించలేదు. ఆ తర్వాత ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఫోన్ పోయిందని గుర్తించిన షాపు యజమాని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా కానిస్టేబుళ్ల నిర్వాకం బయటపడింది. దీంతో ఆ వీడియోను వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో పాటు సిటీ కమిషనర్ కు నేరుగా ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన ఎస్పీ.. కానిస్టేబుళ్ల వద్ద నుంచి ఫోన్ రికవరీ చేయడంతో పాటు వారిని సస్పెండ్ చేశారు.