మన సైన్యం దెబ్బతీసిన ఎయిర్ బేస్ లో పాక్ మరమ్మతులు

  • ఆపరేషన్ సిందూర్ లో పాక్షికంగా దెబ్బతిన భొలారీ ఎయిర్ బేస్
  • మరమ్మతుల్లో భాగంగా హ్యాంగర్‌ను తొలగిస్తున్న దృశ్యాలు వైరల్
  • ఐఏఎఫ్ దాడుల్లో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదన్న పాక్
భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, తామే భారత విమానాలు కూల్చేశామని పాకిస్థాన్ ప్రగల్భాలు పలుకుతున్న సంగతి తెలిసిందే. వాస్తవాలను కప్పిపెట్టి ఆ దేశం చేస్తున్న ప్రకటనల్లోని డొల్లతనం మరోసారి బయటపడింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) యుద్ధవిమానాలు జరిపిన దాడిల్లో పాక్ లోని పలు ఎయిర్ బేస్ లు దెబ్బతిన్నాయి. ఇదే విషయాన్ని భారత్ ప్రపంచానికి వెల్లడించింది. పాక్‌ డ్రోన్‌ దాడులకు జవాబుగా మన వాయుసేన మే 10 న భొలారీ బేస్‌ను టార్గెట్‌ చేసి దాడులు జరిపింది.

ఈ దాడిలో ఉపయోగించిన ఆయుధాల వివరాలను వెల్లడించనప్పటికీ.. ఎయిర్ బేస్ ను పాక్షికంగా దెబ్బతీశామని ప్రకటించింది. పాక్ మాత్రం ఈ వాదనను కొట్టిపారేసింది. అయితే, తాజాగా వెలుగుచూసిన ఉపగ్రహ చిత్రాల్లో భొలారి లోని పాక్ వాయుసేన స్థావరం దెబ్బతిన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు.. అందులోని దెబ్బతిన్న ఓ హ్యాంగర్ కు మరమ్మతులు చేయడం తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 28న వాంటోర్‌ సంస్థకు చెందిన ఉపగ్రహాలు ఇక్కడ చిత్రాలను తీశాయి. ఆ సమయంలో ఎయిర్‌ బేస్‌లో దెబ్బతిన్న హ్యాంగర్‌కు పాక్‌ దళాలు మరమ్మతులు చేస్తున్నట్లు తేలింది.


More Telugu News