: ఇక క్యూబాను టార్గెట్ చేసిన ట్రంప్!
- క్యూబా అనేక సంవత్సరాలుగా డబ్బు, చమురు కోసం వెనెజువెలాపై ఆధారపడిందన్న ట్రంప్
- ఇకపై క్యూబాకు చమురు గానీ, ఆర్థిక సహాయం గానీ ఉండవని వెల్లడి
- పరిస్థితి చేయి దాటిపోకముందే ఒప్పందానికి రావాలన్న ట్రంప్
క్యూబా టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్యూబా అనేక సంవత్సరాలుగా డబ్బు, చమురు కోసం వెనెజువెలాపై ఆధారపడిందని పేర్కొన్నారు. ఇకపై క్యూబాకు చమురు గానీ, ఆర్థిక సహాయం గానీ ఉండవని స్పష్టం చేశారు. పరిస్థితి చేయి దాటిపోకముందే క్యూబా ఒప్పందానికి రావాలని ట్రంప్ హుకుం జారీ చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో హెచ్చరిక పోస్టు చేశారు.
ఇదిలా ఉండగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో క్యూబా అధ్యక్షుడవుతారంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ఇది వినడానికి బాగుంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వెనెజువెలా నుంచి భారీగా అందిన చమురు, డబ్బుపైనే క్యూబా ఏళ్ల తరబడి ఆధారపడిందన్న ట్రంప్.. దానికి ప్రతిఫలంగా వెనెజువెలా నేతలకు భద్రతా సేవలు అందించిందని తెలిపారు. అయితే ఇకపై అలాంటిది జరగదని స్పష్టం చేశారు.
ఇటీవల అమెరికా చేపట్టిన దాడిలో క్యూబాకు చెందిన పలువురు భద్రతాధికారులు మృతి చెందినట్లు వెల్లడించారు. వెనెజువెలాకు ఇకపై గూండాలు, దోపిడీదారుల రక్షణ అవసరం లేదని, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా సైన్యం వారికి అండగా ఉందన్నారు. క్యూబాకు ఇకపై చమురు, డబ్బులు అందవని, ఆలస్యం కాకముందే ఒప్పందానికి రావాలని ట్రంప్ హెచ్చరించారు.
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకొచ్చేందుకు అమెరికా నిర్వహించిన ఆపరేషన్‌లో క్యూబాకు చెందిన 32 మంది భద్రతాధికారులు మృతి చెందారని సమాచారం. ఈ దాడిని క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్-కెనల్ తీవ్రంగా ఖండించారు. హవానాలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట వేలాది మంది పాల్గొన్న ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
క్యూబా చమురు అవసరాల్లో దాదాపు 30 శాతం వెనెజువెలానే సరఫరా చేస్తుంది. ఇప్పటికే అస్థిరంగా ఉన్న క్యూబా విద్యుత్ వ్యవస్థ, ఇంధన సరఫరాలకు తాజా పరిణామాలు పెద్ద దెబ్బగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.