సీమకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయం తెలంగాణ అసెంబ్లీ వేదికగా వెల్లడయింది: భూమన

  • రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగడానికి చంద్రబాబే కారణమన్న భూమన
  • రాయలసీమను తాకట్టు పెట్టారని మండిపాటు
  • వైసీపీ హయాంలో జగన్ రూ. 7 వేల కోట్ల పనులు ప్రారంభించారని వెల్లడి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి కారణం చంద్రబాబే అని ఆయన అన్నారు. సీమకు కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తోందో తెలంగాణ అసెంబ్లీ వేదికగా వెల్లడయిందని చెప్పారు. 

రాయలసీమను చంద్రబాబు తాకట్టు పెట్టారని భూమన మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ ప్రయోజనాల కోసం చంద్రబాబు సీమ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో రూ. 7 వేల కోట్లతో జగన్ పనులను ప్రారంభించారని తెలిపారు. రాయలసీమకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేశారని చెప్పారు. గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా భూములను సస్యశ్యామలం చేశారని చెప్పారు. వైఎస్ వారసుడిగా జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించారని తెలిపారు. చంద్రబాబు రాయలసీమ వాసిగా ఉండి కూడా ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని విమర్శించారు. 


More Telugu News