KTR: కేటీఆర్ ర్యాలీలో జగన్ జెండాలు

KTR Rally with Jagan Flags Goes Viral
  • ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో కేటీఆర్ ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొన్న వైసీపీ అభిమానులు, కార్యకర్తలు
  • ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్‌గూడెంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అనూహ్యంగా ఏపీ మాజీ సీఎం జగన్ ఫొటోలు, వైసీపీ జెండాలు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ ర్యాలీలో పాల్గొని జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. రెండు పార్టీల మధ్య స్నేహబంధాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.


బీఆర్ఎస్, వైసీపీ పార్టీల మధ్య ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్, జగన్ మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగింది. రాజకీయ విషయాల్లో ఒకరికొకరు మద్దతు తెలుపుకునేవారు. ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ సందర్భంగా రెండు పార్టీల సాన్నిహిత్యం మరోసారి బయటపడింది.

KTR
KTR rally
Jagan
YSRCP
BRS
Telangana politics
Andhra Pradesh politics
Khammam
Kusumanchi
YS Jagan Mohan Reddy

More Telugu News