Yash: పుట్టినరోజున ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన యశ్‌.. 'టాక్సిక్' టీజర్‌లో స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా అదుర్స్‌!

Yash gives treat to fans on birthday Toxic teaser out
  • బ‌ర్త్‌డే కానుకగా యశ్‌ 'టాక్సిక్' టీజర్ విడుదల
  • నాలుగేళ్ల తర్వాత అభిమానుల ముందుకు రాకింగ్ స్టార్
  • భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా సరికొత్త అవతారంలో యశ్‌
  • 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల
'కేజీఎఫ్' చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ రాకింగ్ స్టార్ యష్.. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆయన నటిస్తున్న పాన్-వరల్డ్ మూవీ ‘టాక్సిక్’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘పెద్దల కోసం ఒక డార్క్ ఫెయిరీ టేల్’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ టీజర్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. రాయ అనే పాత్ర‌లో పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, నోట్లో సిగార్‌తో యశ్‌ మునుపెన్నడూ చూడని క్రూరమైన, స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. శ్మశానవాటిక నేపథ్యంలో కారుతో ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలు, చేతిలో గన్‌తో ఆయన చేసే విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. టీజర్ చివర్లో యశ్‌ చెప్పే “డాడీ ఈజ్ హోమ్” అనే డైలాగ్ అభిమానులతో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రాణం పోసింది. ఈ భారీ ప్రాజెక్టులో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇంగ్లీష్ భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Yash
Toxic movie
Yash Toxic
Kannada actor Yash
Geetu Mohandas
Ravi Basrur
KVN Productions
Gangster movie
Telugu cinema
Pan world movie

More Telugu News