Russia: రష్యా నౌకను ఇలా సీజ్ చేశారు.. వీడియో ఇదిగో!

Video of Russian Ship Seizure by US Coast Guard Released
  • హెలికాప్టర్ లో నౌకపై దిగిన అమెరికా భద్రతా బలగాలు
  • ఐస్‌లాండ్‌ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో నౌక స్వాధీనం
  • అమెరికా ఆపరేషన్‌ కు బ్రిటన్‌ సహకారం
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో రష్యా జెండాతో వెళుతున్న వెనెజువెలా చమురు నౌకను అమెరికా సీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నౌకను స్వాధీనం చేసుకున్న వీడియోను అమెరికా కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించడంలో అమెరికా నిరంతరం కృషి చేస్తోందని పేర్కొంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రక్షణ శాఖతో కలిసి తీర రక్షక దళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించిందని, బ్రిటన్ కూడా సహకరించిందని తెలిపింది.

ఐస్‌లాండ్‌ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో రష్యా నౌక మ్యారినెరా (పాత పేరు బెల్లా-1) ను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది. హెలికాప్టర్‌ నుంచి తమ భద్రతా బలగాలు నౌకపై దిగి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నాయని వివరించింది. దీంతోపాటు ఏ దేశపు జెండాలేని మరో నౌక సోఫియాను కూడా సీజ్‌ చేసినట్లు వివరించింది.
Russia
Ship Seizure
Viral Video
Venezuela oil tanker
US Coast Guard
North Atlantic Ocean
Seized Russian ship
Iceland
Operation
International Law
Sofia ship

More Telugu News