MSVG: మెగా 'హుక్ స్టెప్‌'తో పెరిగిన హైప్.. కొత్త పాటతో దుమ్మురేపిన చిరంజీవి

Chiranjeevi Hook Step Creates Hype for New Song
  • 'హుక్ స్టెప్' పాటతో మరింత పెరిగిన అంచనాలు
  • కొత్త పాటలో మెగాస్టార్ స్టైల్, ఎనర్జీకి అద్భుతమైన స్పందన
  • చిత్రంలో కీలక పాత్రలో విక్టరీ వెంకటేశ్‌
  • అనిల్ రావిపూడి మార్క్ ఎలివేషన్లతో సినిమాపై భారీ హైప్
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌ల అరుదైన కలయికలో వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి రేసులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన ‘అల్టిమేట్ మెగా స్వాగ్’ హుక్ స్టెప్ సాంగ్ ఈ హైప్‌ను మరింత పెంచింది. ఈ పాటలో మెగాస్టార్ తనదైన స్టైల్, స్వాగ్‌తో అదరగొట్టడంతో సినిమాపై ఆసక్తి తారాస్థాయికి చేరింది.

తాజాగా విడుదలైన ఈ పాటలో చిరంజీవి స్టైలిష్ లుక్, ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్‌తో కనిపించారు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ, ఆయన ప్రదర్శించిన ఎనర్జీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. సింపుల్‌గా, ట్రెండీగా ఉన్న హుక్ స్టెప్‌కు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. బాబా సెహగల్ గాత్రం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ఒక నాస్టాల్జిక్ ఫీల్‌ను అందిస్తోందని సంగీత ప్రియులు ప్రశంసిస్తున్నారు.

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ దాదాపు 45 నిమిషాల నిడివి ఉన్న కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. చిరంజీవికి వీరాభిమాని అయిన దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రతి సన్నివేశంలోనూ మెగా బాస్‌కు అదిరిపోయే ఎలివేషన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. నయనతార, కేథరిన్ ట్రెసా కథానాయికలుగా నటించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, ఈ కొత్త హుక్ స్టెప్ సాంగ్ సినిమాపై అంచనాలను పీక్‌కి చేర్చింది. మొత్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించి, సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ‘మన శంకర వర ప్రసాద్ గారు’ భారీ విజయం సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

MSVG
Chiranjeevi
Mega Star Chiranjeevi
Manashankara Varaprasad Garu
Anil Ravipudi
Venkatesh
Sankranthi 2025
Telugu Movie
Ultimate Mega Swag
Hook Step Song
Nayanatara

More Telugu News