Neelapu Venkata Reddy: దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ జవాను ఆత్మహత్య

Neelapu Venkata Reddy Commits Suicide at Duvvada Railway Station
షార్ట్స్‌లో చూడండి
ఓ ఆర్మీ ఉద్యోగి రైలు పట్టాలపై పడుకొని బలవన్మరణానికి పాల్పడటం దువ్వాడ రైల్వే స్టేషన్ లో తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన నీలాపు వెంకటరెడ్డి అనే సైనిక ఉద్యోగి దువ్వాడ రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్ ఫామ్ 1 వద్ద అందరూ చూస్తుండగానే, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

ఫ్లాట్ ఫామ్‌పైకి రైలు వస్తుండటాన్ని గమనించిన అతను ఒక్కసారిగా పట్టాలపైకి దూకాడు. రైలు డ్రైవర్ వేగాన్ని తగ్గించేలోపే అతను పట్టాలపై తలపెట్టి పడుకోవడంతో రైలు చక్రాల కింద మెడ తెగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన చూపరుల హృదయాలను కలచివేసింది. 

Go Back to Shorts
Neelapu Venkata Reddy
Duvvada railway station
Army jawan suicide
Visakhapatnam
Train accident
Suicide case
Indian Railways
Pedagantyada

More Telugu News