Dasoju Shravan: 2,000 చదరపు కిలోమీటర్ల విస్తరణ వెనుక హైదరాబాద్‌ను అలా చేసే కుట్ర ఉందా?: దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు
- హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్ర దాగి ఉందేమోనని ఆందోళన
- హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ప్రజల నోట్లో మన్ను కొట్టినట్లేనని వ్యాఖ్య
- నగరాన్ని విస్తరించడం వెనుక కుట్ర దాగి ఉందా చెప్పాలని ప్రభుత్వానికి నిలదీత
హైదరాబాద్ నగరాన్ని 2,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించడం వెనుక, ఈ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్ర దాగి ఉందా అనే భయం కలుగుతోందని బీఆర్ఎస్ శాసనమండలి సభ్యుడు దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తం చేశారు. మండలిలో ఆయన మాట్లాడుతూ, నాడు రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని ఆంధ్రా పాలక వర్గం డిమాండ్ చేసిందని గుర్తు చేశారు.
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఊరుకునేది లేదని ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేశామని తెలిపారు. అందుకే హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడిందని అన్నారు. కానీ ఈరోజు నగరాన్ని విస్తరించడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు.
దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తెలంగాణ ప్రజల నోట్లో మన్ను కొట్టినట్లేనని అన్నారు. రైతుబంధు, పెన్షన్లు సహా ఏ పథకం రావాలన్నా హైదరాబాద్ మనదిగా ఉండాలని అన్నారు. హైదరాబాద్ నగరం నుంచే తెలంగాణ బతుకుతోందని అన్నారు.