Pawan Kumar: హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య.. భార్య సహా ఆరుగురికి జీవిత ఖైదు
- జగిత్యాల జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, బంధువులు
- నిందితులకు జీవిత ఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు
ఐదేళ్ల క్రితం జరిగిన హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య కేసులో మృతుడి భార్యతో పాటు మరో ఐదుగురు మహిళలకు జీవితఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అల్వాల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాచర్ల పవన్ కుమార్ (38) సజీవ దహనం కేసులో న్యాయమూర్తి ఈ తీర్పును వెలువరించారు.
ఈ కేసు వివరాల్లోకెళితే... జగిత్యాలకు చెందిన విజయ్ కొండగట్టుకు దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కుటీరాన్ని నిర్మించుకున్నాడు. అయితే విజయ్ తమ్ముడు జగన్ అనారోగ్యంతో మృతి చెందాడు. విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బావ పవన్ కుమార్, భార్య కృష్ణవేణితో కలిసి 2020 అక్టోబర్ 20న కుటిరానికి చేరుకున్నాడు.
అయితే పవన్ కుమార్ తన భర్తకు చేతబడి చేయించి చంపాడని ఆరోపిస్తూ అక్కడే ఉన్న జగన్ భార్య సుమలత బంధువులతో కలిసి అతనిని కుటీరంలో బంధించి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గది తాళం తీయగా, పవన్ పూర్తిగా దహనమయ్యాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా, పవన్ కుమార్ భార్య కృష్ణవేణితో పాటు మరో ఐదుగురు మహిళలు ఈ కేసులో నిందితులుగా తేలారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం కృష్ణవేణి సహా ఆరుగురు మహిళలకు జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.